రావిపాడు గ్రామంలో జనసేన పల్లెపోరులో బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: ఆదివారం జరిగిన పల్లెపోరులో భాగంగా రావిపాడు గ్రామ సాయిబాబా గుడిలో దర్శనానంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలను నచ్చి వందమందికి పైగా పెంటపాడు మండల అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ ఆధ్వర్యంలో గ్రామ మహిళలకు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా పార్టీ కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ గ్రామాలలో జనసేనపై ఇంత విశిష్ట స్పందన రావడంపై బొలిశెట్టి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా గాని మంచినీటి సమస్యను తీర్చలేక పోయిందని ఈ గ్రామంలో మూడు మంచినీటి ట్యాంకులు ఉన్న ఒక చిన్న చెరువు ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని నీరు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనీ గుక్కెడు నీటి కోసం ప్రజలు బిందులు పట్టుకొని పరుగులు తీస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనీ ప్రస్తుత పరిస్థితుల్లో నీటి కొరత తీవ్రంగా ఉందనే ప్రజల తీవ్రంగా అవస్థలు పడుతున్నారనీ శ్రీనివాస్ అన్నారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడంతో గ్రామ ప్రజలు మండిపడుతున్నారనీ ఓట్ల కోసం గడప తొక్కే నాయకులు ఇప్పుడు నీటి సమస్యను పరిష్కరించ పోవడంతో వైసీపీ నాయకుల తీరును తప్పు పడుతూ జనసేన పల్లెపోరు కార్యక్రమంలో రావిపాడు గ్రామ ప్రజలు బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, స్థానిక నాయకులుములగాల శివ కేశవ, కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు, ములగాల. ప్రసాద్, ద్వారబంధం వెంకట సురేష్, వంగూరి వెంకట సుబ్బారావు, వంగూరు శివ నాగేశ్వరరావు, అయితం శ్రీనివాస్, మదాసు శ్రీనివాస్, మదాసు చంద్రశేఖర్, మునగాల స్వర్ణ రాజు, వంగూరి పాండురంగారావు, ములగాల పనింద్ర, కడియం శివ, కోనపురెడ్డి రాజేష్, తిలకలపల్లి మణికంఠ, వీర మహిళలు ద్వారబంధం కనకదుర్గ, సజ్జ పని, పాతే జోష్ణ మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.