ఘనంగా బొలిశెట్టి రాజేష్ జన్మదిన వేడుకలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు బొలిశెట్టి రాజేష్ పుట్టినరోజు సందర్భంగా నీలపాల దినేష్, మరపాక చిట్టి అధ్యక్షతన ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కోలహాలంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్ యువసేన, బొలిశెట్టి రాజేష్ ఫాలోవర్స్ కేక్ కటింగ్ చేసి పార్టీ ఆఫీస్ నందు విందు ఏర్పాటు చేశారు. అనంతరం వివిధ సేవా కార్యక్రమాల్లో కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డ్ నందు శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించి అనంతరం లింగ శ్రీను ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ, మద్దాల నరసింహ ఆధ్వర్యంలో స్థానిక తణుకు రోడ్డు బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం, సంధక రమణ గారి ఆధ్వర్యంలో యాకర్లపల్లి ప్రేమాలయం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం, కసిరెడ్డి మధులత గారి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ డిపో వద్ద మజ్జిగ చలివేంద్ర ప్రారంభం కార్యక్రమం, అనుప ప్రసాద్ గారు మరియు రూరల్ మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాధవరం కారుణ్యకేర్ సెంటర్ నందు పిల్లలకు బట్టలు పంపిణీ మరియు భోజన కార్యక్రమం, చాపల రమేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఒకటో వార్డు ఎక్స్ మిల్ట్రీ కాలనీలో టిఓఎం చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలు మరియు కేక్ కటింగ్ కార్యక్రమం,స్థానిక సుబ్బారావు పేట భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో తుమరాడ చిన్న ఆధ్వర్యంలో దివ్యాంగుల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి దివ్యాంగుల పిల్లలకు క్రీడా సామాగ్రి అందజేసారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ దినేష్, చిట్టి ఆధ్వర్యంలో ఈ పుట్టిన రోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయని, అంతేకాకుండా పార్టీలకు అతీతంగా జనసేన నాయకులు మరియు బిజెపి నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో జరగడంతోనే కాకుండా దివ్యాంగుల పిల్లల సమక్షంలో పిల్లలతో కొంత టైం కలిసి ఉండటం నాకు చాలా సంతోషం కలిగించిందని, ప్రతి ఒక్కరూ సమాజంలో దివ్యాంగుల పిల్లల్ని ఆదరించి వారి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని అప్పుడే వారు కూడా సమాజంలో ఇతరులపై ఆధారపడకుండా జీవించగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.