నాదెండ్ల అరెస్టును ఖండించిన బొమ్మిడి నాయకర్

  • నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టు అప్రజాస్వామ్యం: మాదాసు నరసింహ

నరసాపురం: జనసేన పార్టీ పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును ఖండిస్తూ నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడడానికి వచ్చిన నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదు అని అన్నారు. పోలీసు వ్యవస్థను అధికార దుర్వినియోగానికి ఉపయోగించడం సరైన పద్ధతి కాదు అని మండి పడ్డారు. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మొన్న విచౌంగ్ తుఫాన్ బాధితులకు అండగా నిలబడే విధంగా చర్యలు తీసుకోవాలి అని తెలియజేశారు. ప్రజలు ప్రతీదీ గమనిస్తున్నారు అని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అని మీరు చేసే అక్రమ కార్యకలాపాలకు తగు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. మనోహర్ గారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాతాడి కనకరాజు, గుబ్బల మార్రాజు, తోట నాని, యాదంరెడ్డి సుబ్బారావు, పోలిశెట్టి నళిని, ఇంటి మురళి, నల్లి రాజేష్, గ్రంధి నాని, మాట్ల సూర్య, కుసుమ కిరణ్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.