జనసేనాని జన్మదిన వేడుకలలో పాల్గొన్న తుమ్మి లక్ష్మీ రాజ్

నెల్లిమర్ల నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం నెల్లిమర్ల నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ నియోజకవర్గంలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. వేడుకలలో భాగంగా పూసపాటిరేగ మండలం, చోడవరం గ్రామంలో ఇంటింటికీ పూల మొక్కల పంపిణీ కార్యక్రమం మండల అధ్యక్షులు జలపారి శివ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం గైతుల చోడవరం గ్రామంలో వీరమహిళ కర్రీ సరిత ఆధ్వర్యంలో వృద్దులకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం లింగం రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్కూల్లో పిల్లలకు పస్తకాలు, పెన్నులు మిఠాయిలు పంచిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం డెంకడ మండలం బొడ్డవలస గ్రామంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కిరణ్, శివ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం గజపతినగరం నియోజకవర్గంలో మర్రాపు సురేష్ ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని వీర మహిళలచే కేక్ కట్ చేసి, అనంతరం భవన నిర్మాణ కార్మికులతో సహా పంక్తి భోజనం చేయడం జరిగింది. అనంతరం ఎస్ కోట నియోజకవర్గంలో వీరమహిళ ఎర్ర వెంకటలక్ష్మి పిలుపు మేరకు ముందుగా ఇల్లు కాలిపోయిన అనాథ వృద్ద మహిళలకు చేయూత కార్యక్రమం, అనంతరం ఎస్ కోట నియోజకవర్గం, రెల్లి కాలనీలో సొదరిలతో పాటు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. అనంతరం ఎల్ కోట మండలంలో ర్యాలీలో పాల్గొనడం జరిగింది. రాత్రి తొమ్మిది గంటలకు డెంకాడ మండలం పెద్ధతాడివాడ పంచాయితీ గుండలపేట. ఉడికలపేట గ్రామంలో జనసైకులతో కేక్ కటింగ్ ఏర్పాటు చేసి మండల అధ్యక్షులు పతివాడ కృష్ణవేణిని అతిథిగా పిలిచి జనసేనాని చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.