దళిత నాయకుడు గుజ్జర్లపూడికి నివాళులర్పించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి పట్టణం 8వ వార్డుకి చెందిన దళిత నాయకులు గుజ్జర్లపూడి రాజేంద్రప్రసాద్ ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన గృహం వద్ద ఏర్పాటు చేసిన జ్ఞాపకార్ధ కూడిక కార్యక్రమానికి సత్తెనపల్లి జనసేనపార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు హాజరై నివాళుర్పించారు. బొర్రా వెంట నివాళులర్పించిన వారిలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, నాయకులు దార్ల శ్రీనివాసరావు, రంగిశెట్టి సుమన్, చిలకా పూర్ణచంద్రరావు, నాదెండ్ల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.