ఆప్ట్ అనాధ ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

సత్తెనపల్లి నియోజకవర్గం: జనసేనాని పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా శుక్రవారం సత్తెనపల్లి పట్టణంలో ఉన్న ఆప్ట్ అనాధ పిల్లల ఆశ్రమంలో సత్తెనపల్లి జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు కేక్ కట్ చేశారు. అనంతరం పిల్లలకి బిస్కెట్లు, స్నాక్స్ ఇవ్వడం జరిగింది. బాల బాలికల చేతుల మీదగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బొర్రాతో పాటు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, కౌన్సిలర్ సుమన్, రూరల్ మండలాధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, నాయకులు దార్ల శ్రీనివాస్, నామాల పుష్పలత, బత్తుల కేశవ, చిలకా పూర్ణ, రఫీ తదితరులు ఉన్నారు.