పసుపులేటి కేశవులుకు నివాళులర్పించిన బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, చీమలమర్రి గ్రామంలో సీనియర్ జర్నలిస్ట్ ఈనాడు నకరికల్లు మండల విలేకరి పసుపులేటి కేశవులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగినది. ఈ వార్త తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు బొర్రా వెంకట అప్పారావు వారి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాటు జిల్లా నాయకులు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.