జగనన్న కాలనీ సందర్శించిన బొర్రా

సత్తెనపల్లి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయంగా భూములను ఆక్రమించుకొని తన స్వలాభాల కోసం, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ సమస్యలను పట్టించుకోకుండా సత్తెనపల్లి నియోజకవర్గాన్ని, ఈ ప్రాంతంలోని భూములను తన స్వప్రయోజనాల కోసం ప్రజలను భ్రష్టు పట్టిస్తున్న ఈ వైసిపి పార్టీ నాయకులు అంబటి రాంబాబు, ఎమ్మెల్యే మీరు చేస్తున్న అక్రమాలు ఆక్రమణలు ప్రజలంతా గమనిస్తున్నారని, మీరు మీ నాయకుడిలాగా పట్టణాల్లో ప్యాలెస్లు కట్టించుకోవడం కాదు ప్రజలను కూడా పట్టించుకోండని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.