స్వర్గీయ రంగా వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొని నివాళులర్పించిన బొర్రా

సత్తెనపల్లి, మొదటగా సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. అనంతరం సత్తెనపల్లి పట్టణంలోని పోలేరమ్మ దేవాలయం, ముప్పాళ్ళ మండలం, మాదల, రుద్రవరం, నకరికల్లు మండలం, కుంకలగుంట, నకరికల్లు, రాజుపాలెం మండలం, అనుపాలెం, సత్తెనపల్లి మండలం, భ్రగుబండ గ్రామాలలో ఉన్న వంగవీటి రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా బొర్రా మాట్లాడుతూ పేదల పెన్నిధి, పేదల ఆశాకిరణం వంగవీటి మోహనరంగా. పేదలకు పక్షాపతి, వారికి అన్ని విషయాల్లో సహాయకరంగా ఉండే వ్యక్తి మోహనరంగా. రంగా సేవలు కార్యక్రమాలు నేటికి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయి. భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ప్రజల గుండెల్లో రంగా ఉన్నారని అన్నారు.

ఆలయ అభివృద్ధికి విరాళం ఇచ్చిన బొర్రా

జనసైనికుడు బిట్రగుంట కృష్ణారావు ఆధ్వర్యంలో కందుల వారి పాలెంలోని నీలంపాటి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు 25 వేల రూపాయల విరాళాన్ని (చెక్కును) గ్రామ పెద్దలు, ఆలయ కమిటీవారికి అందజేశారు.

ఈ కార్యక్రమాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమిశెట్టి సాంబశివరావు, జిల్లా లీగల్ సెల్ సభ్యులు బయ్యారపు నరసింహారావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తనపల్లి పట్టణ 4 వార్డు కౌన్సిలర్ రంగి శెట్టిసుమన్, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, ముప్పాళ్ల మండల అధ్యక్షులు సిరిగిరి పవన్, చిలక పూర్ణ, చిలక సత్యం, రామిశెట్టి శ్రీనివాసరావు, ఏసుబాబు, ఇతర జనసేన నాయకులు, మండల కార్యదర్శులు, తదితర జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.