సమగ్రశిక్షా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిరసనకు జనసేన మద్దతు

తిరుపతి: విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్రశిక్షా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పిఆర్సి అమలు చేయకుండా, నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని, తక్షణమే రెగ్యులరైజ్ చేసి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయ్యాలని సమగ్రశిక్షా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతిలో పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద చేస్తున్న నిరసనకు మంగళవారం జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. వీరిని ఉద్దేశించి జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, నగర అధ్యక్షుడు రాజారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సమగ్రశిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన నిరసనకు జనసేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, అందులో భాగంగానే మంగళవారం ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, మీయొక్క న్యాయమైన డిమాండ్లను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి రేపు రాబోవు జనసేన, టిడిపి ఉమ్మడి ప్రభుత్వంలో మీకు న్యాయం చేకూరేలా కచ్చితంగా చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ తీరును మార్చుకొని తక్షణమే వీరి డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షాన వీరితో కలిసి జనసేన ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ మునికృష్ణ, మాధవయ్య, ప్రదీప్ కుమార్, శివకుమార్, రాము తదితరులతో కలిసి జనసేన రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు, వీరమహిళలు ఆకేపాటి సుభాషిని, వనజ, లక్ష్మి, దుర్గాదేవి, చందన బాబ్జి, దినేష్ జైన్, మోహన్, హిమవంత్, ఆనంద్, కిషోర్, పార్ధు, సాయి దేవ్, వంశీ, హేమంత్, ఆది, బాలాజీ, సాయి, రమేష్, పురుషోత్తం, నవీన్ లు పాల్గొన్నారు.