గురజాలలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ బీసీలకు అన్యాయం చేశారు: మందపాటి దుర్గారావు

గురజాల నియోజకవర్గంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఓట్ల కోసం బీసీలకు మేం న్యాయం చేసామంటే.. మేము న్యాయం చేశామని ఒకరిపై ఒకరు విమర్శలు కురిపిస్తూ ఉంటారని జనసేన పార్టీ దాచేపల్లి మండల అధ్యక్షుడు మందపాటి దుర్గారావు ఎద్దేవా చేసారు. బుధవారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ..

*ప్రస్తుత ఎమ్మెల్యే మా తాతగారి హయాంలో మేం బీసీ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామని మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈసారి ఒక బీసీ వ్యక్తి టికెట్ ఇచ్చి గెలిపించుకోమని అంటాడు. వాస్తవాల్లోకొస్తే మీ తాతగారు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు టికెట్ ఇచ్చారు. కానీ మీరు వైసిపి పార్టీ లో ఈ నియోజకవర్గానికి రావటమే బీసీల దగ్గర నుంచి టికెట్ లాక్కుంది నిజం కాదా.. అని ప్రశ్నించారు

*అయినా మీకు అండగా నిలబడి మిమ్మల్ని గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి సంబంధించిన బీసీ నేతకి మీ పార్టీలో పదవి వచ్చి నియోజకవర్గానికి వస్తే మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో అందరికి తెలుసు, అడుగడుగునా ఎన్ని ఇబ్బందులు పెట్టారో బీసీలు అంతా చూస్తూనే ఉన్నారు. రాబోవు రోజుల్లో బీసీలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు…!

*మాజీ ఎమ్మెల్యే బీసీలకు మేము చేసిన అన్ని పనులు ఎవరూ చేయలేదు బీసీలకు ఎప్పుడు మేమే అండగా ఉంటాం అంటున్న మీరు అసలు బీసీలకు ఈ నియోజకవర్గంలో మీరు ఏం చేశారు, ఒకటి రెండు నామినేటెడ్ పదవులు ఇచ్చి వారిని ఓటు బ్యాంకుగా చూసే మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఏముంది…!

*మీ ఇద్దరికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే గురజాల నియోజకవర్గంలో ఒక బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అతని గెలుపు కోరుకు మీరు పని చేసే ధైర్యం ఉందా..?

*అంతేగాని ఒకపక్క బీసీలను అణగదొక్కుకుంటా బీసీలకు మేము న్యాయం చేస్తున్నామంటే నమ్మే పరిస్థితిలో నియోజకవర్గ ప్రజలు లేరూ..!

*మీ రెండు పార్టీలకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీ పార్టీల నుండి మీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కాకుండా బీసీ అభ్యర్థులకు టికెట్ ఇప్పించి వారి గెలుపు కోసం పనిచేసే దమ్ము మీ ఇద్దరికి ఉందా అని దుర్గారావు ప్రశ్నించారు.