బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్

టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా బెంగళూరు హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు 12 మ్యాచ్‌లు ఆడగా కోహ్లీసేన 7 విజయాలతో రెండో స్థానంలో, హైదరాబాద్‌ 10 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకోవాలని బెంగళూరు భావిస్తోంది. మరోవైపు టాప్‌-4 రేసులో నిలవాలంటే వార్నర్‌సేన ఈ పోరులో తప్పక విజయం సాధించాలి.