సోహైల్‌కు బ్రహ్మనందం ‘బ్రహ్మాం’డమైన ఆఫర్‌..

ముగిసిన బిగ్‏బాస్ సీజన్ 4 లో రన్నరప్‏గా అఖిల్ నిలవగా.. అభిజిత్ విన్నర్‏గా నిలిచాడు. కానీ అటు మూడో స్థానంలో ఉన్న సోహైల్ రూ.25 లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాను తీసుకున్న రూ.25 లక్షల నుంచి తన అనాథశ్రయాలకు 10 ఇస్తానని చెప్పాడు. దానికి నాగార్జున నేనే ఆ పది లక్షలు ఇస్తాను అని చేప్పగా.. తన మిత్రుడు మెహబూబ్‏కు 5 లక్షలు ఇస్తానని చెప్పాడు. అందుకు చిరంజీవి అభ్యంతరం చెప్పి నేనే ఇస్తాను అని మెహబూబ్ కు చిరు పది లక్షలు ఇచ్చారు . దీంతో సోహైల్‏కు రూ.25 లక్షలు మిగిలాయి. అంతే కాకుండా సోహైల్ తీయబోయే సినిమాలో మెగాస్టార్ అతిథి పాత్రలో నటిస్తానని చెప్పారు. సోహైల్‏కు మరో బంపర్ ఆఫర్ తగిలింది. సోహైల్ తీసే సినిమాలో తాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటిస్తానని బ్రహ్మనందం చెప్పారట. స్వయంగా సోహైల్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. బ్రహ్మనందం ఫోన్ చేసి, నీ కోసమే బిగ్‏బాస్ చూశా.. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నేనే వచ్చి కలుస్తా.. నేను నువ్వు తీయబోయే సినిమాలో ఫ్రీగా నటిస్తానని చెప్పారని.. ఇంతకంటే నాకు ఏం కావాలి? అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు సోహైల్.