బ్లడ్ కాంపోనెంట్ మిషన్ తెప్పించండి: జనసేన నాయకులు

  • ప్లేట్లెట్స్, రెడ్ సెల్స్, ప్లాస్మా తడితరవి జిల్లా ఆసుపత్రిలో రోగులకు ఎక్కించేలా చర్యలు చేపట్టండి
  • జ్వరాలకు ప్లేట్లెట్స్ తగ్గుతుండడంతో విజయనగరం, విశాఖ వెళ్లాల్సి వస్తోంది
  • ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న పేదలైన గిరిజనులు
  • ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పార్వతీపురం జిల్లాకు బ్లడ్ కాంపోనెంటు మిషన్ తెప్పించాలని జనసేన పార్టీ నాయకులకు కోరారు. సోమవారం ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ ను కలిసి బ్లడ్ కాంపోనెంట్ మిషన్ గూర్చి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాకు పెద్దదిక్కు జిల్లా ఆసుపత్రి అన్నారు. అటువంటి జిల్లా ఆసుపత్రిలో రోగులకు ప్లేట్ లెట్స్, ప్లాస్మా, రెడ్ సెల్స్ ఎక్కించేందుకు అవసరమైన సరిపడా మెరుగైన వైద్య సేవలు అందక విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నకు రిఫరల్ గా వెళ్లాల్సి వస్తుంది అన్నారు. ఇందులో ముఖ్యమైనది రక్తంలోని రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ప్లాస్మా తదితరువి వేరుచేసి రోగులకు అవసరమైనటువంటి వాటిని అందించే బ్లడ్ కాంపోనెంట్ మిషన్ లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాల బారిన పడిన రోగులకు ఇటీవల ప్లేట్లెట్స్ తగ్గడం సర్వసాధారణం అవుతుందన్నారు. దీంతో ఇక్కడ రక్త నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ బ్లడ్ కాంపోనెంట్ మిషన్ లేకపోవడంతో ప్లేట్లెట్స్ ఎక్కించేందుకు రోగులను ఆయా విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం రిఫరల్ గా వెళ్లాల్సి వస్తుంది అన్నారు. అంతే కాకుండా రక్త నిల్వలు కూడా అనవసరంగా వృధా అవుతున్నాయన్నారు. ముఖ్యంగా గిరిజనులే అధికంగా వీటి బారిన పడుతున్నారన్నారు. పేదలైన గిరిజనులు విశాఖ, విజయనగరం వెళ్లాలంటే ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాబట్టి జిల్లా ప్రజల సౌకర్యార్థం బ్లడ్ కాంపోనెంట్ మిషన్ ను జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసి రోగులకు తగు సేవలు అందించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఐటీడీఏ పీవో సి. విష్ణు చరణ్ మాట్లాడుతూ ఇప్పటికే తమ దృష్టిలో ఉందని, ఈ విషయాన్ని కమిషనర్ తో మాట్లాడి బ్లడ్ కాంపోనెంట్ మిషన్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.