వచ్చే నెలలో భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

కరోనా వైరస్ కారణంగా భారత గణతంత్ర వేడుకలకు హాజరు కాలేకపోయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చే నెలాఖరులో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు బ్రిటన్ కార్యాలయం తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన తర్వాత ఆ దేశ ప్రధాని తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.

ఈ పర్యటన ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకే అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవచ్చని బ్రిటన్ భావిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో బ్రిటన్‌లో నిర్వహించనున్న జీ7 సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. అంతకంటే ముందే బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనకు రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.