గూడూరు పట్టణంలో బ్రో విజయోత్సవ సంబరాలు

గూడూరు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సాయి తేజ్ నటించిన బ్రో మూవీ శుక్రవారం విడుదలై హిట్ టాక్ రావడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గూడూరు పట్టణంలో మెగా బ్రదర్స్ సేవాసమితి ఆధ్వర్యంలో సినిమా హల్ వద్ద కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ సందర్బంగా అభిమానులు మాట్లాడుతూ బ్రో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, ఇంతటి ఘనవిజయం అందించిన పవన్ కళ్యాణ్, సాయి తేజ్ అభిమానులకి మెగా సినిమా ప్రేక్షకుల అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. అలాగే రాబోయే 2024 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీని అత్యధిక సీట్లు విజయం సాధించి అధికారంలోకి రావడం పక్కా అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సూర్య, విష్ణు, హర్ష, సాయి, శివ, శంకర్, మోహన్, రాకేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.