యాదాద్రి ఘాట్ రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు.. నిలిచిన రాకపోకలు

తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దాదాపు అన్ని జలశయాల్లో జలకళ ఉట్టిపడుతోంది. కాగా, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక్కడి రెండో ఘాట్ రోడ్డుపై పెద్ద బండరాళ్లు దొర్లిపడ్డాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పినట్టయింది.

కొండచరియలు విరిగిపడడంతో రెండో ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భక్తులను 1వ ఘాట్ రోడ్డు ద్వారా యాదాద్రి పైకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.