చేబ్రోలు గ్రామ జనసేన కార్యాలయంలో బుద్ధపౌర్ణమి వేడుకలు

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామ జనసేన కార్యాలయంలో బుద్ధపౌర్ణమి(గౌతమి బుద్ధుని జన్మదినోత్సవం) ఉత్సవాలను గొల్లప్రోలు మండల జనసేన ఉపాఅధ్యక్షులు వెలుగుబంటి దొరబాబు అధ్యక్షతన జరిగినవి. ముందుగా గౌతమబుద్ధుని చిత్రపటం వద్ద గొల్లప్రోలు మండల జనసేన గౌరవ అధ్యక్షులు అల్లం దొరబాబు అగరబత్తిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌతమి బుద్ధుని జన్మదినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైయిన జ్యోతుల శ్రీనివాసు గౌతమబుద్ధుని చిత్రపటానికి పూలమాలను వేసి అంజలి ఘటించారు.అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563వ సంవత్సరంలో జన్మించారు, గౌతమబుద్ధుడు అసలు పేరు సిద్ధార్దుడు. ఆయన గౌతమి అనే స్త్రీ పెంపకం పెరగడం వల్లన గౌతమ బుద్ధుడు అనే పేరు‌ వచ్చినది. గౌతమ బుద్ధుడు రాజు కుటుంబంలో జన్మించిన కాని సర్వం పరిత్యాగం చేసి యోగిగా మారిపోయి సమాజంలో బలమైన మార్పుకు ప్రయత్నం చేశారు.క్రీస్తుపూర్వం 543వ సంవత్సరంలో అనాటి మన సమాజంలో గల కులమత వ్యవస్ద లోపాలను సంస్కరణ మార్గాలు గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గాలు ద్వారా బోధించారు. ముఖ్యంగా బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే నినాదాలు ద్వారా నాటి మన సమాజంలో గల లోపాలను సంస్కరణాలు చేశారు. పైన పేర్కొన్న బోధనల సారాంశాన్ని అవగహన చేసుకొన్నా మన భారతదేశం రాజ్యాంగ రచయిత, గౌరవనీయులైన బాబా సాహెబ్‌ అంబేద్కర్ బౌద్ధయిజం తీసుకొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 7 సిద్దాంతాలను బౌద్ధయిజం నందు సారాంశం నుండి తయారు చేసినవి. కాబట్టి మన అందరం కూడా బౌద్ధయిజం సిద్దాంతాలు ఆచరించి జనసేన పార్టీ ద్వారా సమసమాజం స్దాపన కొరకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నానికి పూర్తి మద్దతు ఇవ్వవలసినదిగా జనసైనికులను జ్యోతుల శ్రీనివాసు కోరడం జరిగింది. చేబ్రోలు గ్రామ పంచాయతీ 10వ వార్డు సభ్యులు దమ్ము చిన్నా మాట్లాడుతూ బుద్ధపౌర్ణమి సందర్భంగా బుద్ధుని జన్మదినోత్సవానికి హజరయిన నాయకులకు, జనసైనికులకు, గ్రామప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం కార్యక్రమానికి హజరైయిన వారికి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు జనసేన నాయకులు శివలంక నాగు, ఓరుగంటి సత్తిబాబు, తేటకాయల గోవిందరాజు, కొమ్మకుల అర్జున్, తేటకాయల వెంకట సత్తిబాబు, చేదులూరి త్రిమూర్తులు, కొమ్మకుల గోవింద్, చెల్లా రాము, సాతినాల లచ్చబాబు, ఉలవకాయల గోవిందు, మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల నానాజీ, తేటకాయల బాబ్జి, వాడబోయిన సాంబ, జ్యోతుల గణపతి, గంటా గోపి, మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతరాంబాబు, ఉల్లిశెట్టి గంగ, కీర్తి చిన్నా, కొలా నాని, జీలకర్ర బాను‌, మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.