గుడ్లూరు లో జూనియర్ కాలేజీ నిర్మించండి: పులి మల్లికార్జున రావు

కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలం అత్యంత కీలకమైనదని ఎంతో శక్తివంతమైనదని మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరూ చెప్పుకోవడం తప్పితే అక్కడున్న వారిని ఎన్నికల టైంలో మందుకి డబ్బుకి బానిసలను చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత అసలు సమస్యలను మరిచిపోయే విధంగా జనాలను మభ్యపెట్టి తిరగడం తప్పితే ఈ నియోజకవర్గంలో గుడ్లూరు మండలంలో అభివృద్ధి శూన్యం అని చాలా ఖచ్చితమైన నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ పత్రికా ముఖంగా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ మానుగుంట మహేందర్ రెడ్డి గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను గుడ్లూరు మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 20 నుంచి 22 గ్రామాలు విద్యార్థులు అటు 30 కిలోమీటర్లు కావలి ఇటు 20 కిలోమీటర్లు కందుకూరు వెళ్లి పదవ తరగతి పాసైన విద్యార్థులు చదువుకోవలసిన పరిస్థితి ఉందని గడపగడపకు తిరిగిన తిరుగుతున్న శాసనసభ్యులు గారికి తెలియదు అనుకోవటం ఎంతో అమాయకంగా ఉంది కనీసం విద్యార్థులు రోజు బస్సు ప్రయాణం చేసి కందుకూరు లేదా కావలి వచ్చి వారు చదువుకొని మళ్లీ తిరిగి రాత్రివేళ ప్రయాణాలు చేస్తూ ఒకవేళ ఏదైనా క్లాసులు ఎక్స్టెన్షన్ అయ్యి ఉంటే బస్సు లేట్ అవ్వడం లేదా బైక్ ప్రయాణాలు చేయడం ఎంతో ప్రమాదకంగా మారుతున్న ఈ తరుణంలో గుడ్లూరు లో ఒక జూనియర్ కాలేజీ నిర్మించాలని జనసేన పార్టీ తరఫున శాసనసభ్యులు గారికి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము. సుమారుగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి 200 నుంచి 400 మధ్య విద్యార్థులు కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్నారు అని మేము ఒక సర్వేలో తెలుసుకున్నాము. ఇంట్లో తల్లిదండ్రులు బాధలకు లోను కాకుండా అదే కాలేజీ గుడ్లూరు గ్రామంలో ఉంటే మహిళలకు ఆడబిడ్డలకు ఎంతో శ్రేయస్కరమని తెలియజేస్తున్నాము. మహిళలు కందుకూరుకు వెళ్లి కావలి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడి ఉండడం కంటే గుడ్లూరు లో ఒక జూనియర్ కళాశాల నిర్మిస్తే వీరి యొక్క సమస్యలు గానీ అన్ని నిర్వీర్యం అవుతామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ప్రభుత్వాలు మారిన నాయకులు మారిన స్వార్థపూరిత రాజకీయం తప్పితే కనీసం విద్యార్థుల గురించి ఆలోచించే ఆలోచన లేని నాయకులను ఈ మండలంలో ఉన్నారంటే హాస్యాస్పదమైన విషయం ముఖ్యంగా ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్న విషయమేమిటంటే.. రైతు వ్యవసాయం చేసుకొని తన బిడ్డలను చదివించుకోవాలని ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి రూపాయి రూపాయి కూడా పెట్టి చదువు చదివిస్తూ ఉంటే ప్రైవేట్ విద్యాసంస్థలు వారికంతట వాళ్లే అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఉండి కూడా 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి మీలాంటి నాయకులు ఇది పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఉద్యోగాలకి వలస పోయి చదువుకోవడానికి వలస పోయి బ్రతకటానికి వలసపోయి జీవిత కాలం నియోజకవర్గంలో పుట్టినందుకు మీరు అధికార ప్రభుత్వాల్లో చేస్తున్నందుకు మా బతుకులు ఇవేనా అని.. కొంతమంది విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో జనసేన పార్టీ నుంచి మీకు పత్రికా ముఖంగా ఈ వినతిని అందజేస్తున్నాము విద్యార్థులు చదువుకునే విధంగా కాలేజీ నిర్మిస్తారని నిర్మించాలని అలాగే గుడ్లూరు మండలంలోని దారకంపాడు గ్రామం దగ్గరలోని రాళ్లపాడు నుంచి వచ్చే కాలువ మరమ్మత్తు పనులు చేపడతారని పూడికలు తీయిస్తారని ప్రతి సమస్యను కూడా మీరు త్వరితగతిన పరిష్కరించకపోతే ఉవ్వెత్తున జనసేన పార్టీ నుంచి కలెక్టర్ గారికి అర్జీలు నివేదించి ఒక ఉద్యమ రూపం ద్వారా అయినా సరే కాలేజీ నిర్మాణానికి పూడికతీయుల వ్యవహారానికి పరిష్కారం చూపే విధంగా జనసేన పార్టీ ముందుకు వస్తుందని ఈ పత్రిక ముఖంగా గౌరవనీయులైన శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నామని జనసేన నాయకులు పులి మల్లికార్జున రావు డిమండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు జిల్లా కార్యదర్శి కత్తి అంకోజీరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొర స్వామి, గుడ్లూరు మండల జనసేన నాయకులు కార్యకర్తలు సైనికులు కందుకూరు నియోజకవర్గ జనసైనికులు మరియు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.