తమిళనాట బురేవి బీభత్సం

బురేవి తుఫాను దక్షిణ తమిళనాడు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తోంది. అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 24 గంటలకు పైగా సముద్రంలో స్థిరంగా ఒకే చోట కదలకుండా ఉంది బురేవి. మరో 12 గంటలపాటు అదే చోట ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఈ తుపాన్‌ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామనాథపురం మీదుగా దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో భారీ వర్షాలు, తంజావూరు, పుదుకోట్టై, శివగంగై, విల్లుపురం, తిరువణ్ణా మలై, అరియలూరు, పెరంబలూరు, వేలూరు, తిరువళ్లూరు, రాణిపేట, కారైకాల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.