మోటురి దంపతుల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం కలెక్టరేట్లో సోమవరం వేసవికాలంలో విపరీతమైన ఎండలతో ప్రజల దాహం తీర్చడానికి తొమ్మిదవ వారం చిందాడగరువు ఎం.పి.టి.సి మోటురి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే స్పందన కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎండ వేడి తట్టుకోలేక అల్లాడుతున్న ప్రజలఅందరికీ దాహం తీర్చారు. ఈ కార్యక్రమంలో అమలాపురం టౌన్ సీ.ఐ, జె.ఎస్.పి నాయకుడు లింగోలు పండు, కొప్పుల నాగ మానస, పేరూరు ఎంపీటీసీ పనస బుజ్జి, ఏ ఎస్ ఐ తదితరులు పాల్గొన్నారు.