తొలగించిన పింఛన్లను వెంటనే అమలు చేయాలి: పాలవలస యశస్వి

  • అవ్వతాతలు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్లు తొలగించేందుకు మనసెలా వచ్చింది వైఎస్ జగన్ రెడ్డి గారికి

ప్రభుత్వం అనర్హత వేటుతో తొలగించిన అర్హుల ఫించన్లు వెంటనే అమలు చేయాలని విజయనగరం నియోజకవర్గ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి డిమాండ్ చేసారు. తొలగించిన పింఛన్లవిషయంపై గురువారం విజయనగరం జనసేన ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పోరాడుతుంది అందుకే పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు, జగన్ సీఎంగా ప్రజలకు కష్టాలు కన్నీల్లే మిగిల్చారు పింఛన్లను దౌర్జన్యంగా తొలగించారు, జగన్ కలెక్టర్లను తిట్టాలని కార్యక్రమం మొదలుపెట్టాలి అని చెప్పటం దుర్మార్గం, మీరు రాజకియాలకు ఆనర్హులు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుందని అందుకే మా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని యశస్వి అన్నారు. యువత జనసేన పార్టీని ఆధరించడం సంతోషంగా ఉందన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు కన్నీల్లే మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వతాతల పింఛన్లు, వితంతువుల పింఛన్లు, దివ్యాంగులు పించన్లను తొలగించడానికి జగన్‌కు మనసెలా ఓప్పిందో అర్థం కావడం లేదన్నారు.ప్రభుత్వం పింఛన్లను దౌర్జన్యంగా తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పింఛన్లు తొలగించి నేతలు రాజకియాల్లో ఎలా ఉండగలుగుతున్నారని ప్రశ్నించారు. అంత మంది పింఛన్లను తొలగించి ఏ విధంగా గడపగడపకు వెళ్తున్నారని నిలదీశారు. అర్హులకు పింఛన్ ఇచ్చేంత వరకు జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుందని, అవసరమైతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమం అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గణపతి రావు కు వినత పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ శ్రీమతి మాతా గాయత్రి, జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, దంతులూరి రామచంద్ర రాజు, మోపాడా అనిల్, మజ్జి శంకర్, రవిరజు చౌదరి, హుస్సేన్ ఖాన్, వాసు, సూర్యారావు, అప్పలనాయుడు, జనసైనికులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-12-29-at-2.46.52-PM-1024x542.jpeg