పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో శుక్రవారం భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్త్కు హామీ యాత్రా కార్యక్రమం తుమ్మలపల్లి సీతారాం ఆధ్వర్యంలో 44 డివిజన్ గౌరీ శంకర్ వీధి ద్వారకానగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ వై.సి.పి ప్రభుత్వ హయాములో లోపభూఇష్టమైన విధి విధనాలతో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యిపోయిందన్నారు. ఒక పాలసీ అమలులోకి తీసుకొచ్చేముందర దానిపై సమగ్రంగా పరిశీలన జరిపి అందులోని లోటుపాట్లను క్ష్యేత్ర స్థాయిలో తెలుసుకుని ఆచరణలోకి తీసుకురావాలనీ అందుకు భిన్నంగా చేస్తే ఎలా ఉంటుందో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుక సీనరేజి విషయంలో చూస్తున్నామన్నారు. కేవలం తన ధన దాహంతో మొత్తం గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాలోచనతో తన బినామీకి ఇచ్చి అత్యధిక రేట్లకు ఇసుకని మార్కెట్లో అమ్ముతూ గృహనిర్మాణ రంగాన్నీ, మౌలికసదుపాయాల నిర్మాణాలనీ ఇలా మొత్తం నిర్మాణ రంగాన్ని చంపేసారన్నారు. దీని ఫలితంగా భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలనీ వీరి కుటుంబాల ఉసురుకి జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అన్నారు. ఇలాంటి అసమధ్ర ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికులకోసం జనసేన అండగా నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోరం చిరంజీవి, గరగ శ్రీనివాస్, శెట్టి జోగిరాజు, అడపా నరేష్ కుమార్, ముమ్మిడి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.