భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి వర్ధంతి నివాళులు

నందికొట్కూరు పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బుధవారం భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీంరావు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని జనసేన-తెలుగుదేశం పార్టీ సమన్వయ బాధ్యుడు నల్లమల రవికుమార్ మరియు తెలుగుదేశం రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గిత్త జయసూర్య ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్లమల రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు అంటే దానికి కారణం రాజ్యాంగంలో దళిత హక్కుల కొరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన పోరాటమే కారణం అని కొనియాడం జరిగింది. ఆయన అందరికీ ఒక స్ఫూర్తి అని కొనియాడారు. తర్వాత గిత్త జయసూర్య మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. దళిత కుటుంబం నుంచి వచ్చి అణగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా అంబేద్కర్ నిలిచారనీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బలహీన వర్గాల కోసం రాజ్యాంగంలో విద్యతో పాటు వారికి సరైన హక్కులను కల్పించడంలో సక్సెస్ అయ్యారని, దీంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, రాజకీయవేత్త అలాగే, సంఘ సంస్కర్త కూడా అయినటువంటి ఆయన జీవితాంతం దళిత జాతి సంక్షేమం, స్వేచ్ఛ కోసం కృషి చేశారనీ సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారనీ దళిత నేపధ్యం నుంచి వచ్చిన అంబేద్కర్ అణగారిన వర్గాల హక్కుల కోసం పాటుపడుతూ భారత రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని పొందారనీ గిత్త జయసూర్య చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మద్దిలేటి, కుమార్ టిడిపి నాయకులు మహేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, నాగముని, షకీల్ అహమ్మద్, ముర్తుజావలి, జమీల్, రసూల్, వేణుగోపాల్, కళాకార్, రాజన్న, రాజు, చాంద్, కాంతారెడ్డి, మల్లికార్జునరెడ్డి, మాబాషా,కుమార్, మోహన్, శ్రీను, గని, ఏసేపు, శేఖర్, రగడ, భరత్, ముత్తు, హుస్సేన్, బాబుసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.