‘రాజధాని’ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేం: డిజిపి సవాంగ్

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు మహా పాదయాత్రకు సిద్దమవుతున్నారు. న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో 45 రోజుల పాటు ఈ పాదయాత్ర చేయాలని అమరావతి పరిరక్షణ సమితి, జెఎసి నిర్ణయించాయి. ఈ నేపధ్యంలో పాదయాత్రకు అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ వారు లేఖ రాశారు. దీనిపై స్పందించిన డిజిపి గౌతమ్ సవాంగ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. శాంతియుతంగా పాదయాత్ర చేయుటకు అనుమతిని నిరాకరించడంపై అమరావతి పరిరక్షణ సమితిక, రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు వారు తెలిపారు.