Pithapuram: ఆపన్న హస్తం అందించిన జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి..!!

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో కొంత కాలంగా దూలపల్లి రాజులమ్మ అనారోగ్యంతో కాలు వాపు ఎక్కువ అయ్యి బాధపడుతున్న ఆమెను చూసి మన జనసేన నాయకురాలు పిఠాపురం నియెజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి వారి దృష్టికి తీసుకెళ్లాగా వెంటనే స్పందించి వారి భర్త డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ కి తెలియజేయగా వారు వెంటనే స్పందించి ఫోన్ లో మాట్లాడి రాజులమ్మ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని ఆమెకు మెరుగైన వైద్యం కొరకు డాక్టర్లతో సంప్రదించి మీకు నయం చేసే ప్రయత్నాలు చేస్తామని చెప్పటం జరిగింది. ఈ కుటుంబానికి అన్ని విధాలుగా ఆడపడుచులా ముందు ఉంటానని చెప్పారు మా జనసైనికులు కష్టం ఉన్నచోట ఎప్పుడూ ముందుండి సొంత కుటుంబంలా తోడుగా ఉంటారని ప్రత్యేకంగా జనసైనికులు అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నానని శేషుకుమారి తెలియజేశారు. వారికి కూరగాయలు, రైస్ బ్యాగ్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల అధ్యక్షురాలు తోలేటి శిరీష, చిత్రాడ ఎంపీటీసీ -1 దూలపల్లి రత్నం, చిత్రాడ 6వ వార్డు మెంబెర్ విజయ రామలక్ష్మి , పిఠాపురం రూరల్ కార్యవర్గ సభ్యులు కోటిపల్లి గోపి, నిమ్మన దుర్గబాబు, బాబిశెట్టి శివనందీశ్వరరావు, పిఠాపురం రూరల్ ప్రచార కార్యదర్శి పెంకే జగదీష్, నంద్యాల జాన్ బాబు నాయుడు, మణికంఠ, యాగ సతీష్, అల్లు చందు, సిగాటపు వీరన్న, నాగం వెంకన్న, మేడ తూ దేవబాబు, కోటిపల్లి రాజు, నాగం మధు, నురుకుర్తి సత్తిబాబు, దూలపల్లి అప్పారావు, గడ్డం లోవబాబు, దూలపల్లి చిన్నఅప్పారావు, దూలపల్లి రాఘవ, నురుకూర్తి అబద్ధం, దూలపల్లి నాగరత్నం, గెడ్డం మణి, శిలి బాబ్జి, జనసైనికులు తదితరులు రాజులమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి విచ్చేసారు. జనసైనికులు అందరు వారితో మాట్లాడి, మీకు పూర్తిగా నయం అయ్యే అందరం ఇదే స్ఫూర్తితో అండగా ఉంటామని తెలిపారు. జనసైనికులు అందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారితో మమేకమై ఉంటారని తెలియజేశారు.