ప్రైవేటు పాఠశాలల టీచర్ల ఖాతాల్లో నగదు జమ

రాష్ర్టంలోని ప్రయివేటు పాఠశాలల టీచర్లకు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2 వేలు నగదుతో పాటు 25 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తాజాగా మే నెలకు సంబంధించి 2,04,743 మందికి రూ. 40.94 కోట్లు బదిలీ చేశారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పాఠశాలలు తెరిచే వరకు రూ. 2 వేల సాయం, ఉచిత బియ్యం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో ఒక లక్షా 24 వేల మందికి 25 కిలోల రేషన్ బియ్యం ఇచ్చారు. ఒక లక్షా 12 వేల మంది టీచర్ల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున నగదు జమ చేశారు.