రోడ్లపై తిరుగుతున్న పశువులు, కుక్కలు.. చర్యలు తీసుకోండి

అమలాపురం: అమలాపురం పట్టణంలో కుక్కలు, పశువుల వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పట్టణంలో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బందే కాకుండా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సమస్యలను తీవ్రంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ వి.ఐ.పి.ఐ నాయుడును జనసేన మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను, కౌన్సిలర్లు పడాల శ్రీదేవి, తిక్కా సత్యలక్ష్మి కోరారు.