కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు సీబీఐ సమన్లు …

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఈనెల 25 న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గత నెల 5వ తేదీన డీకే శివకుమార్ తోపాటు.. ఆయన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ ఇంటిపై కూడా సీబీఐ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సీబీఐ సోదాలు జరిపింది. సోదాల్లో రూ.57లక్షల నగదు, పలు డాక్యుమెంట్లు, లభించినట్లు సీబీఐ తెలిపింది. ఒక్క బెంగళూరులోనే తొమ్మిది చోట్ల, ముంబైలో ఒక చోట, ఢిల్లీలో నాలుగు చోట్ల కలిపి మొత్తం 14 చోట్ల సోదాలు జరిపామని సీబీఐ ప్రకటించింది.

ముందు గా ఈనెల 23న తమ హాజరుకమ్మని సీబీఐ కోరిందని, కానీ తనకు వేరే కార్యక్రమం ఉన్నందున 25న హాజరవుతానని తెలిపారు. కర్ణాటకలోని మస్కి, బసవకళ్యాణ నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలను ప్రకటించే అవకాశాలున్నాయి. అందుకే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నేతలు పర్యటించనున్నారు.