ఘనంగా డా.బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

విశాఖపట్నం, గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు యారాడ గ్రామం, జాషువా నగర్ లో డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా 64 వ వార్డు జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం సభలో బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన అందరికీ ప్రతి సామాన్యుడికి సమానమైన హక్కులు కల్పించే విధంగా చేతికి ఒక ఆయుధం అందించారు ఆయుధం పేరే ఓటు మీ ఓటుతో మీ తలరాత ను మీరే మార్చుకోండి అని గొప్ప సందేశాన్ని ఇచ్చారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆయన ఆశయాలకు తగ్గట్టు అదే సిద్ధాంతాలతో జనసేన పార్టీని స్థాపించారు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీరంతా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని నమ్మి మీ ఓటు అనే ఆయుధాన్ని పొద్దున చేసి ఒక శిల్పాన్ని చెక్కి మీ సమస్యల పరిష్కారానికి ఒక రూపాన్ని తయారు చేశారు ఆ రూపమే మీ దల్లి గోవిందరెడ్డి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని సొంత లాభానికి కాకుండా ప్రజా ప్రయోజనాలకి ప్రజా సమస్యల పరిష్కారానికై శ్రమించే కృషిచేస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాక శాలని, ముసలయ్య, సత్యాల నాగేష్, బంక సాయి, జనసేన కార్యకర్తలు, జనసేన వీరమహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.