యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో వేడుకగా ముగ్గుల పోటీలు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ చేపట్టిన మన ఊరు-మన ఆట కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల క్రీడా మైదానం నందు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు పట్టణవాసులతో పాటు మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు గ్రామీణ సంప్రదాయం ఉట్టిపడేలా వివిధ ఆకృతులలో రంగురంగుల రంగవల్లులు ఆకర్షణీయంగా అలంకరించారు. యల్లటూరు శ్రీనివాసరాజు గారు క్రీడా మైదానానికి చేరుకుని పోటీలను పర్యవేక్షించారు. గెలుపొందిన మహిళలకు ప్రథమ బహుమతిగా రూ 15 వేలు, ద్వితీయ బహుమతి రూ 10 వేలు, తృతీయ బహుమతి రూ 5 వేలుతో పాటు పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ అంతరించిపోయిన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు, సంప్రదాయ బద్ధమైన ఆచార-వ్యవహారాలు పరిరక్షించేందుకే ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు ఈ పోటీలలో పాల్గొనడం ఆనందకర విషయమని అన్నారు. ఈ సంక్రాంతి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఇంటిలోనూ వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, పి వి ఆర్ కుమార్, మంచుకంటి రవి, నాసర్ ఖాన్, మౌల, భీమినేని రమేష్, పత్తి నారాయణ, పత్తి వెంకట సుబ్బయ్య, కట్టారు బాబు, చల్లా మదు, సుబ్బరాయుడు మరియు జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ కుప్పాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

  • నాగిరెడ్డి పల్లెలో ముగ్గుల పోటీ

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ, ఆర్ఎస్ రోడ్డులో జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళలు వెళ్ళు వెత్తారు. ముగ్గుల బాక్సుల టోకండ్ల కోసం ఎగబడ్డారు. దాదాపు 200 మంది ఉత్సాహంగా పోటీపడ్డారు. ఎంబలూరు కళ్యాణి ప్రధమ బహుమతి 15000, ద్వితీయ, తృతీయ బహుమతులను ఝాన్సీ లక్ష్మి పదివేల రూపాయలు, వెంకటసుబ్బమ్మ ఐదువేల రూపాయలను గెలుచుకున్నారు. అనంతరం నిర్వహించిన మ్యూజికల్స్ చైర్స్ పోటీలలో వివాహితలు అత్యంత ఆనందంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో సి.మాధవి, ఎస్.లలిత సంయుక్త విజేతలుగా నిలిచారు. ఆర్ఎస్ రోడ్డు మొత్తం సాయంత్రం నుండి పెద్ద ఎత్తున హాజరైన మహిళలతో నిండిపోయి సంక్రాంతి పండగ సందడి ముందుగానే మొదలయింది. వివిధ ప్రాంతాలల నుండి పండుగకు వచ్చినవారు ఈ పోటీలను తిలకించేందుకు ఆసక్తి చూపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణీతలుగా డాక్టర్ శ్రీవాణి, యల్లటూరు మంజుల వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ జ్యోతి, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, ఆకుల చలపతి, గురివిగారి వాసు, తిప్పాయపల్లె ప్రశాంత్, రాజేష్, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.