గుమ్మలూరు జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం, 50 రోజులు పూర్తి

గుమ్మలూరు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేద్రం 50 పూర్తి చేసుకున్న సందర్భంగా కొణిదల పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర టీం పడికిలి పోస్టర్ ను గుమ్మలూరు జనసేన నాయకులు కొప్పినీడి శ్రీనివాసరావు గుమ్మలూరు జనసేనపార్టీ వార్డ్ మెంబెర్, శ్రీమతి దార్లంక ధనలక్ష్మి మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి రావి హరీష్ బాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా రావి హరీష్ బాబు మాట్లాడుతూ గుమ్మాలురులో చలివేద్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2020 కూడా నిర్వహించడం జరిగింది 2021లో కరోనా కారణంగా నిర్వహించలేకపోయాం మరల ఈ సంవత్సరం గత నెల 10వ తేదీన ప్రారంభించడం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ రోజుకి 50 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంత విజయవంతంగా చలివేంద్రం రన్ కావడానికి ముఖ్యలు కొప్పినీడి శ్రీనివాసరావు ఈయన ప్రోత్సహం ఇచ్చి మీరు కార్యక్రమం చేయండి అని చెప్పి చలివేంద్రం ఎన్ని రోజులు పెట్టినా దానికి మినరల్ వాటర్ మరియు మజ్జిగ పోయడానికి మనిషికి జీతం ఇస్తూ ప్రత్సాహం ఇస్తున్నారు అని అన్నారు. మరియు మజ్జిగా దాతలుగా తమంత తామే వచ్చి ఈరోజు మజ్జిగ మేము పెట్టుకుంటామని వచ్చిన ప్రతి దాతకు గుమ్మలూరు జనసేన పార్టీ గుమ్మలూరు జనసైనికుల తరుపున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు తేజ, అంజనీ ప్రసాద్, విజయ్, రాంబాబు, మధు, సాలెం, వంశీ బన్నీ, బాలు, బాబీ మరియు లారెన్స్ మొదలగువారు పాల్గొన్నారు.