గుంతకల్ పట్టణ మెగా అభిమానుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

గుంతకల్: పద్మభూషణ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి మరియు జనసేననాని పవన్ కళ్యాణ్ ల సేవా స్ఫూర్తితో గుంతకల్ పట్టణ చిరంజీవి యువత ఆధ్వర్యంలో, చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గోపి, గుంతకల్ అధ్యక్షుడు పాండు కుమార్ ల అధ్యక్షతన “మెగా చలివేంద్రం” స్థానిక చైతన్య థియేటర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, బిజెపి నాయకురాలు వనగొంది విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ శ్రీ చిరంజీవి గారు కరోనా విపత్కర పరిస్థితిల్లో ఉచిత ఆక్సిజన్ బ్యాంక్ స్థాపించి ప్రజలకు చేసిన సేవలను, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండాలని ప్రతి రైతు కుటుంబానికి 1లక్ష రూపాయల చొప్పున తన సొంత నిధులు 30 కోట్లు ఖర్చు పెడుతూ “కౌలు రైతు భరోసా” యాత్ర ద్వారా ప్రజలకు చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకొని వేసవికాలం సందర్భంగా మెగా చలివేంద్రం ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని, మనిషి మాధవుడుగా మారే ఏకైక మార్గం సేవ చేయడమే అని, దేశం నాకేమిచ్చింది అని కాకుండా దేశానికి నేనేమి ఇవ్వగలను అనే సామాజిక బాధ్యతతో మెలగాలని, అలాగే రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మెగా అభిమానులు అంటే సమాజసేవకులు అనే విధంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గుర్రం సూర్యనారాయణ, రాష్ట్ర సాయిధరమ్ తేజ్ అధ్యక్షుడు పవర్ శేఖర్, చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఎస్. కృష్ణ సీనియర్ నాయకులు పూల ఎర్రి స్వామి, గాజుల రఘు, ఆటో రామకృష్ణ, సాయి ధరంతేజ్ పట్టణ అధ్యక్షుడు ఎంపీ పామయ్య, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అల్లు రవి, అల్లు మనోజ్ జనసైనికులు మంజునాథ్, అనిల్ కుమార్, కసాపురం వంశీ, అమర్, దోసెలుడికి మల్లికార్జున, ఆటో బాషా, ఆటో కృష్ణ, ముత్తు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.