చంద్రబాబుకి బెయిల్ లభించడం ప్రజాస్వామ్య విజయం: గురాన అయ్యలు

విజయనగరం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం ప్రజాస్వామ్య విజయమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో.. ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, ఆయన బెయిల్‌పై రావడాన్ని అందరం స్వాగతిద్దామని అన్నారు. వైసీపీ నాయకులకు అసలు సినిమా ఇప్పుడు ప్రారంభమైందన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కసారి జనంలోకి వచ్చారంటే వైసీపీ పతనం ప్రారంభమైనట్టే అని అన్నారు. వైకాపా కక్ష సాధింపు చర్యలను సమైక్యంగా ఎదుర్కొంటామన్నారు.