తెలంగాణ ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపింది. లాభదాయకమైన వ్యాధులకే చికిత్సలు చేస్తూ.. మిగిలిన వాటికి చేయకుండా రోగులను వెనక్కి పంపుతున్న కార్పొరేట్‌ ఆసుపత్రులకు చెక్‌పెట్టేలా ఈ చర్యలు ఉండబోతున్నట్టు మంత్రి ఈటెల వివరించారు. కరోనా చికిత్సను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే త్వరలోనే గాంధీలో ఇతర సాధారణ వైద్య సేవలు ప్రారంభిస్తామన్నారు ఈటెల. ఇప్పటికే ఇతర ఆస్పత్రుల్లో ఇతర వైద్య సేవలు మొదలయ్యాయని ఆయన చెప్పారు. బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఇంటివద్దే నిర్వహించుకోవాలని ఆయన కోరారు. పండుగల పేరుతో ఎక్కువ మంది కలిస్తే కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఈటెల హెచ్చరించారు.