రాయల్ సోల్డియర్స్ ఆధ్వర్యంలో మానవతా సేవాసమితి నందు అన్నదాన కార్యక్రమం

గుంటూరు, మహనీయుల ఆశయాలను ఆచరణలో చూపటం కూడా ముఖ్యమే అని భావిస్తూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జేఎస్పి రాయల్ సోల్డియర్స్ అధ్యక్షులు అన్నదాసు వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో గురువారం గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెం గ్రామంలో ఉన్న మానవతా సేవా సమితి నందు అన్నదానం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి, రెల్లి సంఘ రాష్ట్ర నాయకులు సోమి శంకరరావు, అన్నదాసు వెంకట సుబ్బారావు, శిఖా బాలు తదితరులు పాల్గొన్నారు.