మైనారిటీలకు మోసం

  • జగన్ ప్రభుత్వంపై జనసేన మైనారిటీ నాయకులు షేక్ భాషా లిమ్రా ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో దుల్హన్ పధకం అమలుపై రాష్ర్ట మైనారిటీ నాయకులు హైకోర్ట్ కు ఆశ్రయించగా, దుల్హన్ పదకం అమలు చేయటానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ప్రభుత్వాధికారులు హైకోర్ట్ కు చెప్పటంపై జగన్ చేతకాని పరిపాలనకు నిదర్శనమని జనసేన పార్టీ మైనారిటీ ముఖ్య నాయకులు రాజమండ్రి నగర ప్రధాన కార్యదర్శి షేక్ భాషా లిమ్రా ఆగ్రహం వ్యక్తచేసారు. జగన్ పాదయాత్రలో టీడీపి ప్రభుత్వం దుల్హన్ పధకం కింద యాభై వేలు ఇస్తోందని, మా ప్రభుత్వం 2019 లో అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష రూపాయిలు ఇస్తానని పాదయాత్రలో హామి ఇచ్చి, తొంభై శాతం మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మాట తప్పం, మడం తిప్పం అంటూ భాషా ప్రశ్నించారు. మైనారిటీలకు విదేశీ విధ్య, ఇస్లాం బ్యాంక్ లూ, ఇమామ్ లకు, మౌజాన్ లకు ఇళ్ళ నిర్మాణం, అనేక పదకాలు ఇస్తామని చెప్పారు. వైసీపీ లో రాజకీయ నిరుధ్యోగ మైనారిటీలకు కార్పొరెషన్స్ లో నిరుపయోగమైన పదవులు ఇచ్చి వేల జీతాలు ఇస్తున్నారు తప్పా, జగన్ వల్ల కింద స్ధాయి మైనారిటీలకు ఓ రూపాయి సహాయం కూడా అందనివ్వకుండా చేసారని మైనారిటీ సోదరులు తెలుసుకోవాలి. వైసీపీ మైనారిటీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, కేవలం జగన్ ఓట్ల కోసమే మైనారిటీలపై ప్రేమ చూపించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారని గ్రహాంచాలి. మాట తప్పం, మడం తిప్పం అంటూ, రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న మైనారిటీలకు ఏ పధకం ఇవ్వకుండా దారుణంగా మోసం చేయటం కాదా అంటూ భాషా తీవ్ర ఆగ్రహం వ్యక్త పరిచారు. 2019 లోనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మైనారిటీలకు సచార్ కమిటీ విధానాలు అమలు చేస్తామని చెప్పారు. 2024 లో అదే సచార్ కమిటీ విధానాలు జనసేన మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకీ రాగానే అమలు చేయాలని జనసేన మైనారిటీ నాయకులుగా మేము పవన్ కళ్యాణ్ గారి ధృష్టికి తీసుకువెళతాం అని భాషా తెలియజేసారు. ఇప్పటికైనా జగన్ వల్ల మోసపోకుండా 2024 లో రాష్రంలో మైనారిటీలు అందరూ పవన్ కళ్యాణ్ కి మన సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిని చేయాలని భాషా కోరారు.