నిరుపేద కుటుంబానికి అండగా మెరకముడిదాం జనసేన

చీపురుపల్లి నియోజకవర్గం, మెరకముడిదాం మండలం, గరుగుబిల్లి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం లక్ష్మి చాలా ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది కొన్ని నెలలు క్రితం ఇల్లు కూడా కాలిపోయింది ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందలేదు. ఈ విషయాన్ని తెలుసుకొని మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి జనసేన నాయకులు జనసైనికులు ఆ గ్రామం వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పి త్వరలో మీకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం జనసేన పార్టీ మెరకముడిదాం మండల తరపున అధ్యక్షులు కృష్ణవేణి మరియు జనసైనికుల చేతుల మీదుగా 30,000 నగదును ఆమెకు అందజేయడం జరిగింది. అలాగే ఇల్లును నిర్మించుకోవడానికి సరిపడా సిమెంటు ఇసుక చీపురుపల్లి మండల అధ్యక్షులు విసవిగిరి శ్రీనివాసరావు మరియు కాపుసంబాం జనసైనికులు ఇంటికి సరిపడా ఇటుకను ఇవ్వడం జరిగింది. మీకు జనసేనపార్టీ ఎప్పుడూ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా అమె కుటుంబానికి క్రియాశీల సభ్యత్వం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు రౌతు కృష్ణవేణి, మండల నాయకులు రౌతు నాయడు, రాగోలు రామకృష్ణ, అగురు వినోద్ కుమార్ ఐటి కోఆర్డినేటర్, పి.సత్యనారాయణ, ధనుంజయ, లెంక జగదీశ్, సీతంనాయుడు, ఆ గ్రామ జనసైనికులు మరియు చీపురుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు అయినటువంటి తీగల శంకరరావు, కోటి, కిషోర్ కుమార్, బాకూరి శ్రీను, ముళ్ళు జగదీష్, చందక బాల, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి కష్టం వచ్చినా, సమస్యలు వచ్చినా మన జనసేనపార్టీ ముందుంటుందని తెలిపారు.