టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌

దుబాయ్‌ వేదికగా మంచి జోష్‌తో ప్రారంభమైన ఐపీఎల్ 13వ సీజన్ సందడిగా సాగుతోంది. ఐపీఎల్‌లో 13వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై సారథి ధోనీ మాట్లాడుతూ.. మిగతా రెండు వేదికలతో పోలిస్తే షార్జా పిచ్ కొంత భిన్నంగా ఉంటుందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క మార్పుతో చెన్నై బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన రాయుడు ఆడడం లేదు. అతడి స్థానంలో రెండు రోజుల క్రితమే జట్టులో చేరిన రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు కల్పించారు.

రాజస్థాన్ తన తొలి మ్యాచ్‌లోనే బలమైన చెన్నై జట్టును ఢీకొంటున్నది. ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలోని రాజస్థాన్ బరిలో దిగింది.