ముఖ్యమంత్రి గారు నోరు అదుపులో పెట్టుకోవాలి: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో బాగంగా సురేష్ నాయుడు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు కడపలో జరిగిన బహిరంగ సభలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్లిళ్ల గురించి మాట్లాడటం సిగ్గు చెట్టుగా వుంది. రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పకుండా, రాష్ట్ర అభివ్రుద్దికోసం కంపెనీలు తీసుకు రావడం, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం అనే విషయాలను గాలికి వదిలేసి.. పక్కవారి వ్యక్తిగత విషయాలను రాజకీయ నైతిక విలువలు లేని వారే మాట్లాడతారు. రాష్ట్ర ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను, 22 ఎంపీలను ఇస్తే వీళ్ళు రాష్ట్ర అభివృద్ధిని, రైతుల సమస్యలను గాలికి వదిలేశారు. ఇకనైనా సరే మీకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచించండి. అంతేగాని అనవసరంగా మా అధినేత గురించి మాట్లాడితే మాత్రం ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి తాతలు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన కుటుంబంలోని వారు ఎంతమందితో ఎవరు కాపురాలు చేస్తున్నారు అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. వ్యక్తిగత విమర్శలకు జనసేన ఎప్పుడూ దిగజారదు, మీరు కూడా రాజకీయంగానే మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అలా లేని పక్షంలో మేము కూడా మీ వ్యక్తిగతలలోకి, కుటుంబాల్లోకి రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము అని సురేష్ నాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, గుంట మల్లికార్జున్, రవికుమార్, శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.