ఆదిలక్ష్మి వివాహానికి చిలకం మధుసూధన్ రెడ్డి ఆర్థిక స‌హాయం

ధర్మవరం పట్టణంలోని 39 వ వార్డు రామ్ నగర్ కు చెందిన సింగేటి ఆదిలక్ష్మి కి చిన్నతనంలోనే తల్లితండ్రులు, తన అన్న బాబూ ముగ్గురు చనిపోవడంతో అప్పటినుంచి ఆమెను వారి బంధువులు సింగేటి బేబీ, సింగేటి సరస్వతిలు పెంచుకుంటూ వచ్చారు. అయితే ఈనెల ఆమెకు పెళ్ళి కూడా నిశ్చయించయించడం జరిగింది. ఈ విషయం సేవ్ ధర్మవరం కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి పర్యటిస్తున్నప్పుడు తెలుసుకొని శుక్రవారం వారికి పెళ్లి ఖర్చులకు గాను 5 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది.