బేతపూడి అనిల్ నివాళులర్పించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి మండలం, బేతపూడి గ్రామం, బాపూజీ నగర్ చెందిన జనసైనికుడు బేతపూడి అనిల్ ఆదివారం మరణించడం జరిగింది. సోమవారం బాపూజీ నగర్ లో వారి స్వగృహానికి వెళ్లి అనిల్ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించిన మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు నాయకులు కార్యకర్తలు. తదనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, జనసేన పార్టీ మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, జనసేన పార్టీ తరఫున వారి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.