china floods: 33కు చేరిన మృతులు

బీజింగ్‌: మధ్య చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో ఊహించని వర్షాలకు ఇప్పటి వరకు 33 మంది బలయ్యారు. మరో ఎనిమిది మంది ఆచూకీ తెలియాల్సి ఉందని స్థానిక అత్యవసర నిర్వహణ బ్యూరో గురువారం తెలిపింది. 3,76,000 వేల మందికి సురక్షితంగా తరలించామని, 2,56,000 పునరావాసం కల్పించామని పేర్కొంది. ఈ వర్షాలు, వరదలకు సుమారు 2,15,000 హెక్టార్ల పంట నీట మునగ్గా… దీని వల్ల సుమారు 1.22 బిలియన్‌ యాన్‌ ఆర్థిక నష్టం జరిగింది. అత్యధికంగా ప్రభావితమైన ఈ ప్రావిన్స్‌ రాజధాని జెనాన్‌జౌలో తాత్కాలికంగా వర్షం తగ్గింది. దీంతో నగర ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లైంది.