వృద్ధురాలికి పింఛను అందజేసిన చింతా సురేష్ బాబు

పాణ్యం నియోజవర్గం, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ వార్డులో నివసిస్తున్న వితంతువు 70సంవత్సరాల వృద్ధురాలు సువర్ణమ్మకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు 6వ నెల పింఛను అందించడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ సువర్ణమ్మ అన్ని విధాలా పింఛనుకు అర్హులైన ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందకపోవడం బాధాకరమైన విషయం గత 6 నెలలుగా ఈమెకు జనసేన పార్టీ తరఫున స్థానిక నాయకులు బాలు మరియు వారి మిత్ర బృందం కలిసి ₹2501/- అందిస్తూ వస్తుంది. ఈ నెల కూడా జనసేన పార్టీ తరఫున పింఛను ఇవ్వడం జరుగుతుంది. ఈనెల పింఛను నందికొట్కూరు మండలం బిజివేముల గ్రామ జనసైనికుడు వెంకటేష్ సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బెల్లం కొట్టిన రాయిలా పడి ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. 2024 లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో మొదటి పింఛను ఈమె నుండే మొదలు పెడతామని సురేష్ బాబు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచే వరకు పెద్దమ్మకు పెన్షన్ శాంక్షన్ చేసేవారు ప్రతి నెల జనసేన పార్టీ ఇస్తుంది ఆరు నెలలు అవుతున్నా నిజమైన అర్హురాలికి పెన్షన్ రాకపోవడం బాధాకరం. ఇప్పుడున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేతగానితనం అలాగే రేపటి నెల నుంచి 2500 ఒక్క రూపాయి ఇస్తున్న జనసేన పార్టీ పెన్షన్ 2751 రూపాయికి పెంచబోతుంది. జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2750 రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తుందో లేక మాట మారుస్తారో చూడాలి. జనసేన పార్టీ మాత్రం కచ్చితంగా రేపటి నెల నుంచి 2751/- రూపాయలు పెన్షన్ పెద్దావిడకు ఇస్తుంది. ప్రతినెలా జనసేన పార్టీ ఇస్తున్న పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్న పాణ్యం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఇంచార్జ్ చింతసురేష్ బాబు, బాలు, మంజునాథ్, రాంబాబు, బజారి, కృష్ణ బాబు, షబ్బీర్, కొండల్, సతీష్, ఖుషి, శివ తదితర జనసైనికులు పాల్గొన్నారు.