కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ర్ట మంత్రి కేటీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఒక రోజు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాలని అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు కూడా చిరు కృతజ్ఞతలు తెలిపారు.

చిరంజీవి ట్వీట్.. హ్యాపీ బర్త్‌డే కేటీఆర్. ఈ సందర్భంతో పాటు ప్రతి సందర్భంలోనూ మొక్కలు నాటాలి. వాటిని పెంచాలి. గ్లోబల్ వార్మింగ్‌ను ఆపాలి. ప్రకృతిని మనం రక్షిస్తే.. అది మనల్ని రక్షిస్తుంది. ముక్కోటి వృక్షార్చన, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.