పలు కుటుంబాలను పరామర్శించిన చిర్రి బాలరాజు

పోలవరంలో జనసేన పార్టీ వార్డ్ మెంబర్ మేడూరి గంగన్న ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు, మరియు మేడూరి సత్యనారాయణ ఇటీవలే రోడ్ ప్రమాదంలో గాయలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జి చిర్రి బాలరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, మండల అధ్యక్షులు చిన్ని వారిని, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి ఆరోగ్య స్థితి తెలుసుకుని, వారితో మాట్లాడటం జరిగింది. చిర్రి బాలరాజు వారిని ధైర్యంగా ఉండాలని మేము, పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తెలగంశెట్టి రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి కనమర్లపూడి నాగేశ్వరావు, బండి బాబీ, సామియేలు, ఉడతా గణేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.