వారాహి యాత్రకి ప్రతి జనసైనికుడు తరలి రావాలి

  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్

జగ్గంపేట: స్థానిక బాలాజీ రెస్టారెంటులో ఏర్పాటు చేసిన సమావేశానికి వారాహి యాత్ర విజయవంతం నిమిత్తం జగ్గంపేట నియోజకవర్గం సమన్వయ కర్తగా పార్టీ నియమించిన గాజువాక నియోజకవర్గ ఇంచార్జి కోన తాతారావుకి జగ్గంపేట నియోజకవర్గం హెడ్ కోటర్ నందు నియోజకవర్గ నాయకులు సాధరంగా ఆహ్వానం పలకటం జరిగింది. అనంతరం సమన్వయ కర్త కోన తాతారావు చేతుల మీదుగా వారాహి యాత్ర గోడప్రతిని ఆవిష్కరణ చేసి, సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీనియోజకవర్గం నుండి బారిగా తరిలివచ్చి వారాహి యాత్ర విజయవంతం చేయాలని, మనందరం దానికి కృషిచేయాలన్నారు. దానికి కావాల్సిన పబ్లిసిటీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో మరో రెండు రోజుల పాటు ఉంటానని అత్యధికముగా సైనికులు కార్యక్రమంకు వచ్చేందుకు అందరూ సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు. యాత్ర విజయవంతం మనందరి బాధ్యత అని చెప్పారు. అనంతరం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టడానికి మన రాష్ట్రంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలోని నియోజకవర్గాలలో జనసేన వారాహి యాత్ర ద్వారా అధ్యక్షుల వారు మన ముందుకు వస్తున్నారు అన్నారు. ముందుగా జూన్ 14వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రోడ్ షో ద్వారా సాయంత్రం కత్తిపూడి సెంటర్ కి చేరుకొని అక్కడ భారి బహిరంగ సభలో ప్రసంగిస్తారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. కానీ ఈ యాత్రను అడ్డుకోవడానికి ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పెద్దాపురం, అమలాపురం పోలీస్ డివిజన్ల పరిధిలో సెక్షన్ 30 అమలు చేయడం విడ్డూరంగా ఉందని తెలియజేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వారాహి యాత్ర ఆగదని అన్నారు. షెడ్యూలు ప్రకారమే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాహి యాత్ర జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన నాయకులు పాలిశెట్టి సతీష్, కిర్లంపూడి మండల అధ్యక్షుల ఉలిసి అయిరాజు, జగ్గంపేట మండల యువత అధ్యక్షుడు మొగిలి గంగాధర్, గోకవరం మండల మహిళా అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మీ, పువ్వుల శ్రీదేవి, తోరోతు శ్రీరామ్, జానకి మణికంఠ, ఆకుల నవీన్, పాము వీరబాబు, మేకా జాను, మాదాసు సాయి కుమార్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.