అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన చిర్రి బాలరాజు

పోలవరం, జీలుగుమిల్లి మండలం తాటిరామన్నగూడెం గ్రామంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో 11 నెలల చిన్నారి చనిపోయింది. వారి కుటుంబ సభ్యులను గురువారం పోలవరం నియోజకవర్గం జనసేన ఇంచార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, మండల సీనియర్ నాయకులు కోలా మధు, అనిల్ జనసైనికులు పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. జరిగిన ప్రమాదానికి చిర్రి బాలరాజు బాధపడ్డారు. అధికారులు ఎమ్మార్వో, విఆర్వో, వాలంటీర్ తో మాట్లాడారు. వారి కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారాన్ని అందజేయాలని వారికి అండగా ఉండాలని ఆయన కోరారు. జనసేన తరుపున తమవంతు సహాయంగా వారి కుటుంబానికి బియ్యం, కూరగాయలు, బట్టలు, నిత్యవసర సరుకులు అందజేసారు. బాధపడవద్దని, మేము మీకు అండగా ఉంటామని బాధను ఓర్చుకుని ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి మండల అధ్యక్షులు పసుపులేటి రాము, మధు, అనిల్, కుంజా రమేష్, సంకురుడు, మడకం రమేష్, పట్టేలా చింటూ, తాటి జగదీష్ తదితరులు హాజరయ్యారు.