“ఛలో మచిలీపట్టణం” జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ విడుదల చేసిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పేద ప్రజల గుండె చప్పుడులోంచి పుట్టిన పార్టీఏ జనసేన పార్టీ అని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. మచిలీపట్నంలో ఈనెల 14వ తేదీన జనసేన పార్టీ పదవ (10) ఆవిర్భావ సభకు సంబంధించిన గోడ పత్రికను పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన శ్రేణులు సభను విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లేటి బాపన్నదొర, పల్నాటి మధుబాబు, బొజ్జ గోపికృష్ణ, పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.