నీలిమ మృతిపై విచారణ జరిపించాలి: ఆర్డీఓ కు జనసేన వినతిపత్రం

  • అధికారుల కార్యనిర్వహణ లోపం కారణంగా డయాలసిస్ పెషెంట్ నీలిమ మృతి

గూడూరు ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచి జనరేటర్ ద్వారా ఆక్సిజన్ అందక మంగళవారం డయాలసిస్ పెషెంట్ మృతి చెందడం ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరిని తెలియచేస్తుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల కార్యనిర్వహణ లోపం కారణంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న యువతి నీలిమ మృతి చెందిన సంఘటనపై విచారణ జరిపి, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 20న గూడూరు తూర్పువీధి కి చెందిన నీలిమ అనే డయాలసిస్ పేషంట్ కు చికిత్స జరిగే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, జనరేటర్ ఉన్నప్పటికీ ఆక్సిజన్ అందించక నీలిమ మృతి చెందడం దారుణమన్నారు. విద్యుత్ లేని సమయంలో జనరేటర్ ద్వారా ఆక్సిజన్ ను అందించే సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తెలియచేస్తుందని, నీలిమ మృతి పై విచారణ చేసి, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఇంద్ర వర్ధన్, ప్రధాన కార్యదర్శి వంశీ, సహాయ కార్యదర్సులు సాయి కిరణ్, ధనుంజయ, శంకర్, సూర్య, శివ, సాయి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.